మహిళల, విద్యార్థినుల రక్షణ కోసమే షీటీం ఏర్పాటు చేసినట్లు నాగర్ కర్నూల్ జిల్లా షీటీం ఇన్చార్జ్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం తాడూరు మండలలోని కూచుకుళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మహిళల రక్షణ, ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులను, మహిళలను ఆకతాయిలు వేధిస్తే నిర్భయంగా షీటీంలను సంప్రదించాలన్నారు. డయల్ 100, లేదా 8712657676 నంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని కోరారు.