మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలను వంద శాతం జాయిన్ చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో ఎంపీడీవోలు, డిపిఎంలు, ఏపీవోలు, ఈసీలు, ఏపీఎంలు, సీసీలు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మహిళలకు ఎల్లప్పుడూ అండగా ఉంటోందని, వారి కోసం స్వయం సహాయక సంఘాలు తదితర వాటి ద్వారా రుణాలు అందచేస్తున్నట్లు పేర్కొన్నారు.