తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యమని రేవంత్ రెడ్డి చివరి ఓసి ముఖ్యమంత్రి అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం కల్వకుర్తిలోని అమరవీరుల స్తూపం వద్ద జరిగిన తెలంగాణ బీసీ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ వచ్చేది బీసీల సర్కార్ అని, రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.