ప్రపంచానికి కరుణ, దయ, ప్రేమ, శాంతి మార్గాన్ని చూయించిన యేసు క్రీస్తు మార్గం ఆచరణ నీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం రాత్రి తలకొండపల్లి మండల కేంద్రంలోని జేరు సలాం చర్చిలో తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల్ మండలాల క్రిస్టియన్ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు.