అదిమానవులు నిర్మించిన నిలువు రాళ్ళకు యునెస్కో గుర్తింపుకు కృషి చేస్తామని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కృష్ణ మండలం ముడుమల్ గ్రామంలోని నిలువు రాళ్ళ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించారు. నిలువు రాళ్ళ విశిష్టత, కాల గమనాన్ని ఎలా గుర్తించే వారు అనే విషయాలు శాస్త్రజ్ఞులు మంత్రికి వివరించారు. నాయకులు పాల్గొన్నారు.