జడ్చర్ల నర్సింగ్ విద్యార్ధిని హత్య..? ఆత్మహత్య...?
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ యువతి (23) గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న దారుణ సంఘటన సోమవారం వెలుగు చూసింది. అత్యాచారం చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. గదిలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. గతంలో యశోద హాస్పిటల్లో నర్సుగా పనిచేసిన శృతిగా గుర్తించారు. గచ్చిబౌలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.