మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో నిరసన తెలిపేందుకు వెళుతున్న మహబూబ్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. ఉద్యమం బిఆర్ఎస్ కు కొత్త కాదని, రానున్న రోజులలో ప్రజా క్షేత్రంలో మరింత పోరాట ప్రతిమతో పోరాడుతామన్నారు.