మహబూబ్ నగర్: లొంగిపోయిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు

51பார்த்தது
మహబూబ్ నగర్: లొంగిపోయిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ శుక్రవారం లొంగిపోయారని పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్ పురపాలక పరిధి క్రిస్టియన్ పల్లిలోని సర్వే నం.523 ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో ప్లాట్లుగా చేసి విక్రయించడంపై నలుగురిపై కేసులు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ కు పంపామన్నారు. శ్రీకాంత్ గౌడ్ బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారని చెప్పారు.

தொடர்புடைய செய்தி