దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సోమవారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర పట్టణంలోని న్యూ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 10: 00 గంటల వరకు నియోజకవర్గ కేంద్రానికి చేరుకోవాలని కోరారు.