మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పీవీ నరసింహారావు వర్ధంతి పురస్కరించుకుని సోమవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పీవీ తెలుగు వారుకావడం మనమంతా గర్వించదగిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, సురభి వాణీదేవి పాల్గొన్నారు.