మహబూబ్ నగర్: ప్రజావాణి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

83பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ విజయేంద్ర బోయి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదు దారుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని, అధికారులు పెండింగ్ సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி