వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని రామన్ పాడు జలాశయంలో గురువారం వరకు పూర్తిస్థాయి నీటిమట్టం 1, 020 అడుగులకు చేరింది. జూరాల ఎడమ కాల్వ ద్వారా 730, సమాంతర కాల్వ ద్వారా 750 క్యూసెక్కులు ఇలా ఎగువ నుంచి 1, 480 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో ఎన్టీఆర్ కాల్వ ద్వారా 1, 100 క్యూసెక్కులు, వివిధ లిఫ్టుల ద్వారా 688 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కులు వదిలామని ఏఈ రనీల్ రెడ్డి తెలిపారు.