గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ 100 పడకల ఆసుపత్రిని జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య శుక్రవారం పరిశీలించినారు. దుమ్ము, ధూళి, చెత్తతో నిండిపోయిన వంద పడకల ఆసుపత్రి పైన కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు ఆపి తక్షణమే ప్రజలకు వైద్యం అదేవిధంగా అందుబాటులోకి తేవాలి అన్నారు. బెంగళూరు హైవేకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ప్రాణాలు పోయే పేషెంట్ కూడా ప్రాణాలతో బయటపడే పరిస్థితి ఉంటుంది అన్నారు.