మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. కేటీఆర్‌తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర మన్మోహన్ పార్థివదేహానికి కూడా నివాళులు అర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్, ఆయన కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.