గుండాల నుండి వీరాపురం గ్రామానికి రోడ్డు సరిగా లేక బస్సు సర్వీసును ఆర్టీసీ డిపో మేనేజర్ నిలిపివేశారు. ఈ విషయంపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు స్థానిక ప్రజలు విన్నవించగా తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఆర్టీసీ మేనేజర్ తో మాట్లాడి ఆర్టీసీ సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. దింతో ఆర్టీసీ బస్సును మళ్లీ సర్వీసులోకి తీసుకువచ్చారు.