కొత్తగూడెం: ప్రజావాణి సమస్యలు పరిష్కరించండి
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. పల్లె ప్రకృతివనం కోసం కేటాయించిన భూమిని కబ్జా చేసి అమ్ముకున్నారని, షెడ్లు వేసి ఇంటి నంబర్లు తీసుకున్నారని రైటర్ బస్తీకి చెందిన నాగయ్య ఫిర్యాదు చేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని తెలిపారు.