బూర్గంపాడు మండలం సారపాకలో ప్రతి ఆదివారం నిర్వహించే సంతలో సమస్య నెలకొంటుంది. ఎన్. హెచ్ రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కువ లాభాలు రావాలని సంత నిర్వాహకులు రోడ్డుపైన, అమ్మేందుకు వారికి అవకాశాలిస్తున్నారు.