రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ను సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే సందర్భంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సర్వే ఇన్‌చార్జ్ ను సంప్రదించాలని అన్నారు. అనంతరం జిన్నింగ్ మిల్ లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.