రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం కొత్తగూడెంలోని 34వ వార్డులో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.