మునగ సాగుపై అధికారులకు, రైతులకు ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో పలు మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఈసీలు, రైతులకు అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మునగ సాగు రైతులకు ఒక వరం అని అన్నారు. మనం మన పొలంలో పని చేసుకుంటూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీ రూపంలో, మెటీరియల్ రూపంలో మనకే డబ్బులు వచ్చే అద్భుతమైన అవకాశం మునగ సాగు ద్వారా ఉందని ఆయన తెలిపారు.