రైతులు విక్రయించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా ప్రత్యేక అధికారి కె. సురేంద్ర మోహన్ అన్నారు. పౌరసర ఫరాల సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జిలు, వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, రైస్ మిల్లర్లతో మంగళవారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తో కలిసి ఆయన మాట్లాడారు. రైతులు విక్రయించే ధాన్యానికి 48 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు.