ఏజెన్సీ ప్రాంత గౌడ కులాలకు ఎస్టీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరాటి ప్రసాద్ మాట్లాడుతూ గౌడులకు ఎస్టీ సర్టిఫికెట్లు అందించడంతో పాటు సమగ్ర కుటుంబ సర్వేలోనూ అదే కేటగిరీలో వివరాలు నమోదు చేయాలన్నారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కు కాసుల శ్రీనివాస్, రాజు, రావుల సోమయ్య తదితరులు వినతిపత్రం అందించారు.