2025 జనవరి 5, 6, 7న హైదరాబాదులో జరిగే అఖిలభారత దళిత హక్కుల ఉద్యమం రెండవ జాతీయ మహాసభల పోస్టర్ ను కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ మహాసభలను సీపీఐ కార్యకర్తలు, దళిత నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.