ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10. 30 గంటల కల్లా కలెక్టరేట్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని ఆయన కోరారు.