బూర్గంపాడు మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం పంపిణీ చేశారు. సుమారు 8 లక్షల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.