ఏపీ బడ్జెట్‌పై అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు సభాపతి అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అవగాహన కల్పించారు.