పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అంగన్ వాడీ ఉపాధ్యాయినులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదేశించారు. సమగ్ర శిశు అభివృద్ధి, బాలల సంరక్షణ, చైల్డ్ హెల్ప్ లైన్ తదితర విభాగాల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారుల్లేకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.