ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ఎస్ తారాచంద్ సిసిఏ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి జిల్లాలో బిఎస్ఎన్ఎల్, టి ఫైబర్ వారు చేపడుతున్న ఇంటర్నెట్ 4జీ మొబైల్ టవర్స్ అభివృద్ధి పనుల గురించిసమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. నేటి రోజుల్లో సెల్, అంతర్జాల సేవలు చాలా అవసరమని ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రాధాన్యత బట్టి టవర్లు నిర్మాణం చేపడతామన్నారు.