కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూడు మండలాలకు నూతన ఎంపీడీవోలను నియమిస్తూ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బెజ్జూర్- ప్రవీణ్ కుమార్, లింగాపూర్ - రామచందర్, వాంకిడి - సుధాకర్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఎంపీవోలుగా పని చేస్తున్న వారిని ఎంపీడీవోలుగా నియమించినట్లు పేర్కొన్నారు.