జాతీయ గ్రామీణ హామీ పథకం క్రింద జిల్లాలో చేపట్టిన సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తి చేసి ఎంబీ రికార్డులు సమర్పించాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు 4 రోజులు మిగిలి ఉన్నాయన్నారు.