మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. బుధవారం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 155వ మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలతో ఎమ్మెల్యే నివాళులర్పించారు. గాంధీజీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్రం సాధించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.