

సత్తుపల్లి: విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని, విద్యాశాఖ మంత్రిని నియమించాలని పీడిఎస్యు జార్జిరెడ్డి జిల్లా అధ్యక్షుడు మందా సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం సత్తుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రకటన చేయాలని కోరారు.