రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోత్ ఉక్లా, అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS), జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరం సత్యనారాయణ, కందగట్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.