మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ రెడ్డి ఇటీవల మరణించడంతో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.