ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం మధిర, ఎర్రుపాలెం మండలాలలో పర్యటించారు. ముందుగా రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై ఈ పలు గ్రామాలలో గల ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.