ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

50பார்த்தது
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
ముదిగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యం ఎలా అందుతుందని ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రిజిస్టర్ లను పరిశీలించి, ఆసుపత్రి సౌకర్యాలు గురించి వైద్యాధికారి అరుణాదేవిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி