యూట్యూబ్ ఎప్పటికప్పుడు పలు రకాల మార్పులు, అప్‌డేట్‌లను తీసుకువస్తూనే ఉంది. ఇప్పడు మళ్లీ కొత్త ప్రకటన చేసింది. కంటెంట్ క్రియేటర్‌లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఉన్న 60 సెకండ్ల షార్ట్స్ టైం పీరియడ్‌ను ఏకంగా 3 నిమిషాల వరకు పెంచింది. అయితే ఇది అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. కాగా, ఈ మార్పు కారణంగా గతంలో నిమిషంలోపు అప్‌లోడ్ చేసిన వీడియోలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయా వర్గాలు తెలిపాయి.