సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జీఎం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని ఎంవిటిసిలో 48 రోజుల శిక్షణ పూర్తయిన 27 మంది డిపెండెంట్లకు జీఎం కార్యాలయంలో పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాతినిధ్య సంఘ ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ శ్రీహరి, ఎంవిటిసి మేనేజర్ మల్లన్న పాల్గొన్నారు.