మహిళల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం: పెద్దపల్లి ఎమ్మెల్యే

57பார்த்தது
మహిళల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం: పెద్దపల్లి ఎమ్మెల్యే
మహిళా అభ్యున్నతికి పాటుపడటమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండల ప్రజా పరిషత్ కాంప్లెక్స్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி