ఆన్ లైన్ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డితో కలిసి మధ్యాహ్న భోజన పథక బిల్లుల చెల్లింపుపై కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, పెద్దపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. డీఈఓ మాధవి ఉన్నారు.