
పెద్దపల్లి: ఎస్ఎఫ్ఐ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా నూతన కమిటీని శుక్రవారం జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా 4వ మహాసభలలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా ఆర్ల సందీప్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లాల ప్రశాంత్ లు మరోసారి ఎన్నికయ్యారు. అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా బందెల రాజ్ కుమార్, సహాయ కార్యదర్శులుగా మామిడిపెల్లి అరవింద్, కమిటీ సభ్యులుగా ఆదిత్య, రాజు, మణిరత్నం, అభిరామ్, శివలను ఎన్నుకున్నారు.