దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని దళిత బంధు సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంథని పాత పెట్రోల్ బంక్ వద్ద గల రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి మంథని ప్రధాన చౌరస్తా వరకు సోమవారం ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిధుల విడుదల విషయంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు చొరవ చూపాలని కోరారు.