మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య ఆదేశించారు. అధికారులకు సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తహసిల్దార్ వకీల్, డిప్యూటీ తహసిల్దార్ శంకర్, ఆర్ఐలు రాజేందర్, అజీమ్ పాల్గొన్నారు.