ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులకు మధ్యాహ్నభోజనం బాధ్యతలను తప్పించాలని, పీఆర్టియు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎ. కుషాల్ శుక్రవారం అన్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన పాఠశాల హెచ్ ఎం. మాణిక్యంను బాధ్యులు చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు గురువారం సస్పెండ్ చేశారు. ఉత్తర్వులు అందుకున్న హెచ్ ఎమ్ బిపి పెరిగి పడిపోయారు. విషయం తెలిసి కుషాల్ పై విధంగా మాట్లాడారు.