నాగిరెడ్డిపేట మండలం బెజ్గం చెరువు తండా గ్రామంలో శుక్రవారం జగదంబా దేవి, సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం గ్రామ పురోహితులు, ఋగ్వేద పండితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, వరుణ పూజ, మగేల ప్రవేశం, నవగ్రహ మండపం, వాస్తు మండపం, యోగాని మండల, క్షేత్రపాల మండల, సర్వతోభద్ర మండల, దేవతా స్థాపన అగ్ని ప్రతిష్ట, అవవాహిత దేవత హోమాలు, తదితర పూజలు నిర్వహించారు.