కామారెడ్డి జిల్లా పిట్లం మండలం సమీపంలో ఆదివారం ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆదివారం సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆకాశంలో మబ్బులు అడ్డు రావడం వల్ల శివలింగం అవతారంలో మేఘాలు దర్శనమిచ్చాయి. పిట్లం నుండి పెద్ద కొడప్గల్ వెళ్లే దారిలో పచ్చని పొలాల మధ్య అద్భుత దృశ్యం కనబడడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు చరవాణి లో క్లిక్ మనిపించారు.