హైదరాబాదులో బీసీ ముఖ్య నాయకుల సమావేశం ఆర్ కృష్ణయ్య ఎంపీ ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి సమావేశంలో కోరుట్ల పట్టణానికి చెందిన నాయీబ్రాహ్మణ కులస్తురాలైన రాచకొండ రోజా న్యాయవాదిని వివిధ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకు, బీసీ లను చైతన్యపరిచినందుకు, వివిధ బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నందుకు గాను బీసీ మహిళా సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాచకొండ రోజా న్యాయవాదిని ఆదివారం నియమించనైనది.