తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఈనెల 31 వరకు ఫీజు చెల్లింపు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6 నుంచి 26 వరకు ఫీజుల చెల్లింపు గడువు ప్రకటించారు. దీనిని మళ్ళీ, ఇంటర్ బోర్డు అధికారులు డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.