హర్యానాలోని కైతాల్‌లో శనివారం ఊహించని ప్రమాదం జరిగింది. స్థానిక ధాన్యం మార్కెట్‌లో ఐదుగురు వ్యక్తులు కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అక్కడ కూర్చున్న ఐదుగురిని రెప్పపాటులో ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వారంతా ఎగిరి కింద పడ్డారు. వారిలో ఇద్దరిని దాదాపు 20 మీటర్ల మేర కారు ఈడ్చుకెళ్లింది. డ్రైవర్ బ్రేకు బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగింది.