సైబర్ కమాండో పోస్టులకు 1128 అప్లై చేస్తే ఎంపికైంది 346 మందే!

51பார்த்தது
సైబర్ కమాండో పోస్టులకు 1128 అప్లై చేస్తే ఎంపికైంది 346 మందే!
దేశవ్యాప్తంగా సైబర్ కమాండో పోస్టులకు 1128 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న 32 కేంద్రాల్లో శారీరక సామర్థ్య, రాతపరీక్షలు నిర్వహించారు. వీటిలో 747 మంది ఎంపిక కాగా, వారిలో 346 మందిని షార్ట్​లిస్ట్ చేశారు. ఈ సైబర్ కమాండోలకు ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి, సైబర్ నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఛేదన తదితర అంశాల్లో మెరికలుగా తీర్చిదిద్దనున్నారు. జాయింట్ మేనేజ్​మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ తదితర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు.

தொடர்புடைய செய்தி